ఫ్రీడమ్ 2K రన్ లో SKNR డిగ్రీ కళాశాలకు గోల్డ్ మెడల్

జగిత్యాల (ఆగస్టు – 11) : భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జగిత్యాల జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫ్రీడమ్ 2K రన్ లో SKNR డిగ్రీ కళాశాల విద్యార్థిని సీహెచ్ రాహుల్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డా. యమ్. సంజయ్ కుమార్ జిల్లా పాలనాధికారి జి. రవి, జిల్లా ఎస్పీ సింధుశర్మ, జిల్లా పరిషత్ చైర్మన్ తదితరులు అభినందించారు.

తదనంతరం SKNR డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. అశోక్ మాట్లాడుతూ రాహుల్ బంగారు పథకం సాదించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయమ అధ్యాపకులు కొరుకంటి రవికుమార్, NCC ప్రోగ్రామ్ ఆఫీసర్ బి. ఆశోక్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

Follow Us @