వారంలోగా ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటిరీయల్ – సబితా ఇంద్రారెడ్డి

కరోనా కారణంగా విద్యా సంస్థలలో భౌతిక తరగతులు ఫిబ్రవరి 1 నుండి ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా విద్యా సంస్థలు, ఆదర్శ పాఠశాలలోని ఇంటర్ విద్యార్థులకు ఉచిత మెటీరియల్ ను ఇస్తున్నట్లు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.

వారం రోజుల్లోగా ఉచిత మెటీరియల్ సంబంధించిన ప్రభుత్వ కళాశాలలకు చేరాలని, ఆ వెంటనే విద్యార్థులకు అందజేయాలని ఈ సందర్భంగా ఆమె ఆదేశించారు. ఈ ఉచిత మెటీరియల్ తో విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు వేగంగా ప్రిపేర్ అవడానికి అనుకూలంగా ఉంటుందని ఆమె తెలిపారు.

Follow Us@