Home > UNCATEGORY > కళ్ళెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

కళ్ళెం ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ

BIKKI NEWS (NOV. 11) : Free study material supplied by Parasuram to ZPHS Kallem. ఈరోజు కళ్ళెం గ్రామ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జై భీమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి గారి అధ్యక్షతన దళితరత్న అవార్డు గ్రహీత మబ్బు పరశురాం లెక్చరర్ గారు స్టడీ మెటీరియల్ ఆల్ ఇన్ వన్ ఇవ్వడం జరిగింది.

Free study material supplied by Parasuram to ZPHS Kallem

ఈ కార్యక్రమలో పరశురాం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేను చదువుకున్న పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ ఇవ్వడం నా బాధ్యతగా భావిస్తున్నాను, అందరూ బాగా చదివి కుటుంబానికి, పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, ఎరైతే పాఠశాలలో ప్రథమ స్థానంలో వస్తారో నగదు ప్రోత్సాహకంగా 5000/- రూపాయలు ఇస్తామని, అలాగే పాఠశాలకు దినపత్రికలు ఇప్పిస్తానని, వీటిని విద్యార్థులు ఉపయోగించుకుని చైతన్యం కావాలని మాట్లాడారు.

జై భీమ్ ఫౌండేషన్ అధ్యక్షులు మబ్బు రాజు కుమార్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరుపున విద్యార్థులకు జనవరి 26 కి ఆటల పోటీలు నిర్వహిస్తామని తెలిపారు.

యువజన నాయకులు నక్కీర్త మహేష్, బాల్నే శేఖర్ మాట్లాడుతూ పరశురాం గారు ఇదే పాఠశాలలో చదువుకుని మంచి ఉద్యోగం సాధించి,ఇదే పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని తెలిపారు.

అదే విధంగా పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘం నాయకులు విద్యార్థులను ఉద్దేశించి బాగా చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మబ్బు కన్నయ్య,B.C.యువజన నాయకులు సిద్దులు, సంపత్, జై భీమ్ ఫౌండేషన్ ఉపాధ్యక్షులు మబ్బు నవీన్, ఫౌండేషన్ యువకులు మరియు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు