పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటిరీయల్ – సబితా ఇంద్రారెడ్డి

కరోనా కారణంగా తెలంగాణలో విద్యా సంస్థలు పిబ్రవరి ఒకటి నుండి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పదోతరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న 2.20 లక్షల మంది విద్యార్థులకు ఈ ఉచిత స్టడీ మెటీరియల్‌ను అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

Follow Us@