టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్

హైదరాబాద్ (జనవరి 05) : తెలంగాణలో పదవ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మాదిరి ప్రశ్నపత్రాల ఆధారంగా ప్రశ్నలు, సమాధానాలతో కూడిన మెటీరియల్ ను రూపొందిస్తున్నారు. జిల్లా ఉమ్మడి పరీక్షల మండలి (డీసీఈబీ) అధికారులతో చర్చించి స్టడీ మెటీరియల్ ను రూపొందించాలని ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి 19 వరకు నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ విద్యాసంవత్సరం 100 శాతం సిలబస్ 6 పేపర్లకే వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో స్టడీ మెటీరియల్ ఈ పరీక్షల ప్రకారం తయారు చేస్తున్నారు.

★ రెండు ప్రీ ఫైనల్స్

ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు రెండు ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. గతంలో ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఉండగా, ఈసారి ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ -1, మార్చిలో ప్రీ ఫైనల్ -2 నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.