ఉచిత మెటీరియల్ అందజేత

రామగుండం (ఆగస్టు – 11) : ప్రభుత్వ జూనియర్ కళాశాల రామగుండం తెలుగు అధ్యాపకుడు రామకృష్ణ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. మదార్ ఆధ్వర్యంలో తెలుగు స్టడీ మెటీరియల్ ఉచితంగా అందజేయడం జరిగింది.

పేద, బడుగు, బల హీన వర్గాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలుగు అధ్యాపకుడు, టీజీఎల్ఏ సభ్యుడు అయిన రామకృష్ణ తెలిపారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సిహెచ్. మదార్ మాట్లాడుతూ తెలుగు అధ్యాపకుడు రామకృష్ణ చొరవను మెచ్చుకున్నారు. అలాగే విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ఉన్నత విద్యను సక్రమంగా వినియోగించుకొని కుటుంబానికి, కళాశాలకు మంచి పేరు తేవాలని అభిలషించారు.