No Fees – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఇంజనీరింగ్, బీఫార్మా లో నో ఫీజు

BIKKI NEWS : తెలంగాణ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఎంసెట్-2021 కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్, బీఫార్మసీ, బీ-ఆర్క్(ఆర్కిటెక్చరర్) కోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులకు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని (no fees for govt junior college students in engineering) ఎస్సీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీచేశారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసినవారందరికీ ఎంసెట్ ర్యాంకుతో సంబంధం లేకుండా ఇది వర్తిస్తుంది. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఉండాలి.