FREE CIVILS COACHING : మనూ లో ఉచిత సివిల్స్ ప్రిలిమ్స్ కోచింగ్

హైదరాబాద్ (ఆగస్టు – 09) : తెలంగాణ రాష్ట్రంలోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MANUU)
నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ (RCA).. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)- 2024 సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తోంది. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులకు శిక్షణతోపాటు వసతి సౌకర్యమూ కల్పిస్తారు.

అర్హత: ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

★ షెడ్యూల్

దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2023.

ప్రవేశ పరీక్ష తేదీ: 17-09-2023.

ప్రవేశ పరీక్ష ఫలితాల వెల్లడి: 25-09-2023.

ఇంటర్వ్యూ తేదీ: అక్టోబరు 3, 4.

తుది ఫలితాల వెల్లడి: 09-10-2023.

అడ్మిషన్ తేదీలు: 10-15 అక్టోబర్, 2023.

తరగతులు ప్రారంభం : 16-10-2023.

వెబ్సైట్: https://manuu.edu.in/