ఎస్సీ నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ

హైదరాబాద్ (ఆగస్టు 11) : తెలంగాణ నిరుద్యోగ ఎస్సీ యువతకు ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణ ఇవ్వనున్నట్టు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు తెలిపారు. ఆసక్తి ఉన్న అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అభ్యర్థులకు మూడు నెలల వ్యవధితో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, డయాలసిస్ టెక్నీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఇందుకు 18 నుంచి 35 ఏండ్ల వయస్సు ఉండి, పదోతరగతి చదివి ఉండాలని పేర్కొన్నారు. శిక్షణా సమయంలో అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు. వివరాలకు 98485 81100, 9059902355 ను సంప్రదించాలని కోరారు.