విజయవాడ (జనవరి – 01) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న రూపాయి కిలో బియ్యాన్ని నేటి నుంచి ఉచితంగానే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) లబ్దిదారులకు రేషన్ ఉచితంగా ఇవ్వనున్నట్లు ఇటీవల కేంద్రప్రభుత్వం ప్రకటించగా.. రాష్ట్రం కూడా అదే నిర్ణయం తీసుకుంది. NFSAతో పాటు రాష్ట్ర పరిధిలోని మరో 56 లక్షల మంది రేషన్ కార్డుదారులకు ఏడాది పాటు ఉచితంగా బియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపింది.