Home > UNCATEGORY > జీజేసి వైరా విద్యార్థులకు ఉచిత రాగి జావా పంపిణీ – ప్రిన్సిపాల్ ఎల్ నవీన జ్యోతి

జీజేసి వైరా విద్యార్థులకు ఉచిత రాగి జావా పంపిణీ – ప్రిన్సిపాల్ ఎల్ నవీన జ్యోతి

వైరా (జనవరి 22) : Free ragi malt to GJC wyra Students. వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థిని, విద్యార్థులు ఉచిత రాగి జావా పంపిణీ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ ఎల్. నవీన జ్యోతి తెలిపారు.

Free ragi malt to GJC wyra Students.

ఖమ్మం జిల్లా మేజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ ముజేమిల్ ఖాన్ ఆదేశానుసారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత రాగి జావా పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైరా పట్నంలోని స్థానిక
ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు ఉచిత రాగి జావ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు నుండి పరీక్షలు వరకు ప్రతి విద్యార్థికి రాగి జావ పంపిణీ చేయటం జరుగుతుందని కళాశాల ప్రిన్సిపల్ శ్రీమతి నవీన జ్యోతి తెలియజేశారు.

స్థానిక బాలుర హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు మాధవరావు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మాధవరావు మాట్లాడుతూ… ఖమ్మం జిల్లా కలెక్టర్ గారు ఎంతో మంచి మనసుతో విద్యార్థులు ఆరోగ్య గురించి ప్రారంభించిన ఇలాంటి పథకాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని మంచిగా చదివి, మంచి మార్కులతో ఉత్తీర్ణులై కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు