ఉచితంగా పోలీసు ఉద్యోగ శిక్షణ – మంత్రి హరీశ్ రావు

సిద్దిపేటలోని మల్టీ పర్పస్‌ మైదానంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్‌ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్న 230 మంది అభ్యర్థులకు స్టడీ మెటీరియల్‌ అందిస్తానని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హమీ ఇచ్చారు. అలాగే ఉద్యోగార్థులకు ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం నిత్యం ఉదయం అల్పాహారం అందిస్తానని, ఇందులో భాగంగా కార్యక్రమానికి హాజరైనట్లు పేర్కొన్నారు. గతంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్‌లో నిర్వహించిన శిక్షణ శిబిరాల్లో స్టడీ మెటీరియల్ ఇచ్చామని, అదే తరహాలో అందిస్తానని హామీ ఇచ్చారు. రాత పరీక్షల కోసం శిక్షణ అందిస్తామని, మూడునెలల తర్వాత ఫిజికల్‌ ట్రైనింగ్‌ సైతం ఇప్పించనున్నట్లు తెలిపారు. మైదానంలో రన్నింగ్‌ ట్రాక్‌, హైజంప్‌, లాంగ్‌ జంప్‌కు అవసరమైన సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.

అలాగే కాంట్రాక్టు లెక్చరర్లల సంఘం అధ్యక్షుడు కనకచంద్రం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కాంట్రాక్ట్ లెక్చరర్స్ క్యాలెండర్ ఆవిష్కరణ హరీష్ రావు చేతులమీదుగా ఆవిష్కరించబడింది

ఈ సందర్భంగా మరొక్కమారు ముఖ్యమంత్రి బదిలీలకు అనుమతి ఇచ్చి రెండు నెలలు అవుతున్న ఇంకా బదిలీల గైడ్లైన్స్ రాలేదని త్వరగా వచ్చేల, విద్యశాఖ మంత్రితో మరియు అధికారులతో మాట్లాడాలని చెప్పడం జరిగిందని కనకచంద్రం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఉద్యోగార్థుల కలిసి మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అల్పాహారం చేశారు. అనంతరం కళాశాల ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఏఏంసీ చైర్మన్ పాలసాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక సిబంది పాల్గొన్నారు.

Follow Us@