పది‌, ఇంటర్ తో ఉచిత పారామెడికల్ కోర్సుల్లో శిక్షణ

BIKKI NEWS (JULY 16) : free paramedical training by sc corporation. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ యువతకు పారా మెడికల్ కోర్సుల్లో ఉచిత ఉద్యోగ, ఉపాధి శిక్షణకు జూలై 18న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నది.

free paramedical training by sc corporation.

పదో తరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాదించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ మేరకు తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ నర్సెస్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ సీహెచ్ సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

కోర్సులు & అర్హతలు

3 నెలల వ్యవధితో ఫార్మసీ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమెర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్సులకు సంబంధించి ఎస్సెస్సీ అర్హత ఉండాలని వివరించారు.

12 నెలల అడ్వాన్స్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సుకు ఇంటర్ పూర్తి చేసి ఉండాలని తెలిపారు.

వయోపరిమితి : 18 – 35 ఏండ్ల మద్య వయోపరిమితి కలిగి ఉండాలి.

దరఖాస్తు చిరునామా : జూలై 18న వనస్థలిపురం బాటా షోరూం, 4వ ఫ్లోర్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్లకు నేరుగా హాజరు కావాలని కోరారు.

వివరాలకు 98485 81100, 90599 02355 సంప్రదించాలని సూచించారు.

FOLLOW US @TELEGRAM CHANNEL

తాజా వార్తలు