ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్

హైదరాబాద్ (మే – 04) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తో పాటు ఉచితంగా నోట్ బుక్స్ ను కూడా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.

జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లల్లోని విద్యార్థులకు కూడా ఉచితంగా వర్క్ బుక్స్, నోట్బుక్స్ అందజేయనున్నారు. సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోటు పుస్తకాలను ఇవ్వాలని, వీటిని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ నుంచి ఇవ్వాలని భావిస్తున్నారు.