ఇంటర్ విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ – ఇంటర్ బోర్డు

తెలంగాణ రాష్ట్రంలోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న ప్రథమ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు దాదాపు 16 లక్షల మందికి ఉచిత స్టడీ మెటీరియల్ అందించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ సిద్ధమైంది.

ఇప్పటికే సిద్ధమైన ఈ స్టడీ మెటీరియల్ ను త్వరలో విద్యా శాఖ సబితా ఇంద్రారెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం విద్యార్థులకు ఈ మెటీరియల్ ను అందించడానికి విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

కరోనా కారణంగా భౌతిక తరగతుల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఉచిత మెటీరియల్ వారి ఉత్తీర్ణత కు తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.

Follow Us@