హైదరాబాద్ (జూన్ – 28) : Osmania university లో తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో CIVILS 2024 కోసం free long term civils coaching in osmania university కోసం అభ్యర్థుల ఎంపిక కోసం జూలై 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
దరఖాస్తు గడువు జూలై – 10 – 2023 వరకు కలదు. జూలై 16న ప్రవేశ పరీక్ష నిర్వహించి, జూలై 21 న ఫలితాలు వెల్లడించనున్నారు.
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలకు సంబంధించి లాంగ్ టర్మ్ కోచింగ్‌ను జూలై 31 – 2023 నుంచి వచ్చే ఏప్రిల్ 30 – 2024 వరకు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి 150 మందిని ఎంపిక చేయనున్నారు. ఇందులో తొలి 50 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేయగా, మరో 100 మందిని స్క్రీనింగ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.
ఎంపికైన వారికి లాడ్జింగ్, బోర్డింగ్, రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5,000 చెల్లించనున్నారు. మరియు రూ.5,000 విలువైన పుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించడం జరుగుతుందన్నారు. పైగా లైబ్రరీ సౌకర్యం కూడా ఉందని, ఈ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పూర్తి వివరాల కోసం ఫోన్ నం: 040-24071178 లో సంప్రదించాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల చేసుకోవడం కోసం కింద ఇవ్వబడిన వెబ్సైట్ ను సందర్శించండి.
◆ వెబ్సైట్ : TS BC STUDY CIRCLE