బీసీ గురుకుల విద్యార్థులకు జేఈఈ అడ్వాన్స్డ్ ఉచిత శిక్షణ

హైదరాబాద్ (మే – 03) : జేఈఈ మెయిన్స్ అర్హత సాధించిన బీసీ గురుకులాల్లోని విద్యార్ధులకు తదుపరి అడ్వాన్స్డ్ శిక్షణ ఉచితంగా అందించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.

బీసీల కోసం నిర్మిస్తున్న ఆత్మగౌరవ భవనాల నిర్మాణ పనులు వేగం చేయాలని సూచించారు.

సచివాలయంలో వివిధ అంశాలపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకులాల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తదితరులు పాల్గొన్నారు.