గురుకుల టీచర్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్

హైదరాబాద్ (జూన్ 23): తెలంగాణ గురుకుల టీచర్ అభ్యర్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిల్ కేంద్రాలలో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ కే అలోకుమార్ తెలిపారు.

డిగ్రీ, బీఎడ్ లలో 60 శాతంపైగా మార్కులు సాధించిన బీసీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులని వెల్లడించారు.

అభ్యర్థులు టీఎస్ బీసీ స్టడీ సర్కిల్లో కోచింగ్ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 040- 24071178, 040-27077929ని సంప్రదించాలని పేర్కొన్నారు.