హైదరాబాద్ (ఎప్రిల్ – 29) : తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ క్యాస్ట్ స్టడీ సర్కిల్ (TSSC FREE COACHING 2023) తెలంగాణ పోటీ పరీక్షలు మరియు కేంద్రస్థాయిలో ఆర్.ఆర్.బీ, బ్యాంకింగ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి పోటీ పరీక్షల కోసం 5 నెలల ఉచిత శిక్షణతో పాటు వసతిని జిల్లా కేంద్రాలలో కల్పిస్తుంది. జిల్లాకు 100 సీట్ల చొప్పున 11 జిల్లా కేంద్రాలలో ఉచిత శిక్షణ, వసతి అందించనున్నారు. మే 21న నిర్వహించే ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఈ ఉచిత శిక్షణకు ఎస్సీ (75% సీట్లు), ఎస్టీ (10% సీట్లు) బీసీ & మైనారిటీ (15% సీట్లు) అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
◆ దరఖాస్తు విధానము : ఆన్లైన్ ద్వారా
◆ దరఖాస్తు గడువు : ఎప్రిల్ – 28 నుంచి మే – 14 – 2023 వరకు
◆ అర్హతలు : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి
◆ ఎంపిక విధానము : ప్రవేశ పరీక్ష ద్వారా
◆ పరీక్ష విధానము : 100 మార్కులకు (జనరల్ ఎబిలిటీస్ & జనరల్ నాలెడ్జ్)
◆ ప్రవేశ పరీక్ష తేదీ : మే – 21 – 2023 (11.00 నుంచి 01.00 వరకు)
◆ కోచింగ్ గడువు : 5 నెలలు (జూన్ – 1 నుండి అక్టోబర్ – 31 వరకు
◆ కోచింగ్ కేంద్రాలు : నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, సూర్యపేట, కరీంనగర్.
◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tssw/Index.do