తెలంగాణ రాష్ట్రంలోని సెలూన్లు, లాండ్రీలు, దోభీఘాట్లకు ఉచిత విద్యుత్… నెలకు 250 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రజక, నాయీ బ్రాహ్మణ సంఘాల విజ్ఞప్తుల మేరకు పరిశీలించిన తర్వాత సీఎం నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు తక్షణమే జీవో జారీ చేయాలని సీఎంవో కార్యదర్శిని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులు జీవో విడుదల చేశారు. ఉచిత విద్యుత్ సరఫరా ఏప్రిల్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీని ద్వారా లక్షలాది రజక, నాయీ బ్రాహ్మణ కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.
