తెలంగాణలో ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఉచిత ఆన్లైన్ శిక్షణను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇవాళ ప్రారంభించారు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. వివిధ సబ్జెక్టుల్లో నిష్ణాతులైన లెక్చరర్లతో ఆన్లైన్ శిక్షణ ఇస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
కార్పొరేట్ సంస్థలకు దీటుగా ఆన్లైన్ కోచింగ్ నిర్వహిస్తున్నామని, స్వల్ప సమయంలో విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఆన్లైన్ కోచింగ్‌ను http://tscie.rankr.io లింక్ ద్వారా పొందవచ్చని మంత్రి వివరించారు.
గతేడాది తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా 20 వేల మంది విద్యార్థులు శిక్షణకు హాజరుకాగా, వారిలో 2,685 మంది విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు.
Follow Us @