ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్

హైదరాబాద్ (డిసెంబర్ – 05) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు 2023 జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ కోచింగ్‌ (free eamcet coaching) ను నిర్వహించాలని ఇంటర్మీడియట్ కమీషనరేట్ నిర్ణయం తీసుకుంది. కావునా జిల్లా ఇంటర్ విద్య అధికారులు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాల్ లు, కళాశాల లెక్చరర్లు ఉత్సాహవంతులైన విద్యార్థులను ఎంపీసీ, బైపీసీ గ్రూప్ లలో గుర్తించి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉచిత ఎంసెట్ తరగతులు నిర్వహించాలని కోరడం జరిగింది.

ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఫిబ్రవరి లో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి ఏప్రిల్ మే నెలలో జరిగే ఇంటెన్సీవ్ సమ్మర్ ఫ్రీ ఎంసెట్ కోచింగ్ కు జిల్లాకు 50 మంది అమ్మాయిలు 50 మంది అబ్బాయిల చొప్పున ఎంపిక చేసి వారికి ఉచిత ఎంసెట్ శిక్షణ ఇవ్వనున్నారు.

కావున పై అంశాలపై దృష్టి సారించి జనవరి, ఫిబ్రవరి నెలలో ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రతి కళాశాలలో ఎంసెట్ తరగతులు నిర్వహించి జిల్లా స్థాయిలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి వేసవిలో నిర్వహించే ఉచిత ఇంటెన్సివ్ ఎంసెట్ శిక్షణకు విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.