BIKKI NEWS (FEB. 23) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న గృహాలకు 200 వరకు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకము మరియు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27న ప్రారంభించనునట్లు (free current and 500 rupees gas cylinder Schemes from 27th February) సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు..
ఈరోజు సమ్మక్క సారక్క జాతరలో సీఎం రేవంత్ రెడ్డి అమ్మవార్ల దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ… 27వ తారీకున ఆరు గ్యారేంటీలలో ముఖ్యమైన ఉచిత విద్యుత్ మరియు 500/- రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ఫిబ్రవరి 27వ తేదీన జాతీయ నేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.
అయితే ఈ పథకాలు తెల్ల రేషన్ కార్డుదారులకే వర్తిస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్ల రేషన్ కార్డు కోసం అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే తెలరేసిన కార్డులు అందజేసి వారికి కూడా ఈ పథకాలు అందజేయనున్నట్లు సమాచారం.
- TODAY’S NEWS – సమగ్ర వార్తా సంకలనం – 09 – 12 – 2024
- GK BITS IN TELUGU 9th DECEMBER
- చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- India Rank 2024 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- SSC STENO ADMIT CARDS – స్టెనోగ్రాషర్ అడ్మిట్ కార్డుల కోసం క్లిక్ చేయండి