ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఉచిత కంప్యూటర్స్

తెలంగాణ రాష్ట్రంలోని 402 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు కంప్యూటర్లు ఉచితంగా అందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు కొన్ని ముందుకొచ్చినట్లు ఇంటర్ బోర్డు వర్గాలు తెలిపాయి.

రాష్ట్రంలో 402 కళాశాలలు ఉండగా ఒక్కోదానికి కనీసం ఐదు సమకూర్చుకోవాలనే లక్ష్యంతో ఇంటర్‌ విద్యాశాఖ పలు పరిశ్రమలను సంప్రదించింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా సహకారం అందించాలని కోరింది. 1200 కంప్యూటర్లు ఇచ్చేందుకు కొన్ని పరిశ్రమలు అంగీకరించాయని, అవి త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు తెలిపాయి.

Follow Us@