తెలంగాణ రాష్ట్రం లోని ఎన్టీపీసీ రామగుండం వారీ ఆధ్వర్యంలో 8వ, 10వ తరగతి చదివిన నిరుద్యోగ యువతకు ప్లాస్టిక్ ఇంజనీరింగ్ మరియు టెక్నాలజీ లో ఉచిత శిక్షణ, ఉద్యోగావకాశం కల్పించనున్నామని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) డైరెక్టర్ వి.కిరణ్కుమార్ తెలిపారు.
హైదరాబాద్ లోని చర్లపల్లి యందు సీపెట్లో మిషన్ ఆపరేటర్ అసిస్టెంట్ ఇంజక్షన్ మౌల్డింగ్ లో 3 నెలలపాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో ఉచిత భోజనం, వసతి, యూనిఫాం సదుపాయాలను కల్పిస్తామని వివరించారు. శిక్షణ అనంతరం ఆయా కంపెనీల్లో ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఎనిమిది లేదా పదో తరగతి చదివిన నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలకు కింది పోన్ నంబర్లను సంప్రదించాలి
7893586494
9959333418