SSC JOBS : హైదరాబాద్, గుంటూరులలో ఉచిత శిక్షణ, వసతి

విజయవాడ : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) చేపట్టే బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ తదితర విభాగాల్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రామా ఫౌండేషన్ ఉచిత శిక్షణ (free coaching for ssc jobs in hyderabad and Guntur) ఇవ్వనున్నాయి.

సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80 వేలకు పైగా ఖాళీలను త్వరలో భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయా ఫౌండేషన్లు నవంబరు 26న ప్రవేశ పరీక్ష నిర్వహించి, 29న ఫలితాలు ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600 మంది అభ్యర్థులకు డిసెంబరు 2 నుంచి అయిదు నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇచ్చి శిక్షణ ఇవ్వనున్నారు.

వివరాలకు 9703651233, 7337585959, 9000797789ని సంప్రదించవచ్చు.