కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్షకు ఉచిత శిక్షణ – TS స్టడీ సర్కిల్

హైదరాబాద్ (డిసెంబర్ – 04) : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని స్టడీ సర్కిల్ స్టాప్ సెలక్షన్ కమిషన్ (SSC) విడుదల చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష (CGL) మరియు గ్రాడ్యుయేట్ హయ్యర్ లెవల్ పరీక్ష (CHGL) పరీక్షలకు ఉచితం శిక్షణ ఇవ్వడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

అర్హతలు : తెలంగాణ పౌరుడై ఉండాలి, CGL కి డిగ్రీ, CHGL కి ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి. వార్షిక ఆదాయం 3 లక్షలు దాటకూడదు. 18 సం. లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం : అర్హత పరీక్ష మరియు డిగ్రీ, ఇంటర్ లో సాదించిన మార్కుల మెరిట్ ఆధారంగా.

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

ఎంపికైన అభ్యర్థులకు సౌకర్యాలు : ఉచిత శిక్షణ తో పాటు మెస్ చార్జీల కోసం 4,500/నెలకు, ట్రావెలింగ్ అలయొన్స్ 1,000/ నెలకు, బుక్ గ్రాంట్ గా 1,700/ శిక్షణ సమయంలో, ఆన్లైన్ పరీక్ష ఫీజు 350/- గా చెల్లించనున్నారు.

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

దరఖాస్తు చివరి తేదీ : డిసెంబర్ – 17 – 2022

అభ్యర్థుల ఎంపిక తేదీ : డిసెంబర్ – 23 – 2022

◆ సర్టిఫికెట్ ల వెరిఫికేషన్ : డిసెంబర్ – 30 – 2022

◆ కోచింగ్ ప్రారంభం : జనవరి – 02 – 2023

◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tstw/Index.do

Follow Us @