RRB, IBPS, SSC పరీక్షలకు ఉచిత శిక్షణ

హైదరాబాద్ (సెప్టెంబర్ – 10 ) : తెలంగాణ రాష్ట్రంలోని 11 తెలంగాణ రాష్ట్ర స్టడీ సర్కిళ్ల పరిధిలో RRB, IBPS, SSC పరీక్షలకు ఫౌండేషన్ కోర్సు గా 5 నెలల పాటు ఉచిత శిక్షణ హస్టల్ వసతితో ఇవ్వడానికి సెప్టెంబరు 10 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు TSSC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు..

◆ అర్హత : ఏదేని డిగ్రీ కలిగి ఉండాలి. అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉండాలి.

◆ ఎంపిక : ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా

◆ పరీక్ష విధానం : 100 మార్కులకు జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటి అంశాలపై ఉండును.

◆ దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా

◆ దరఖాస్తు ప్రారంభ తేదీ : 10 – 09- 2022.

◆ దరఖాస్తు చివరి తేదీ: 24 – 09 – 2022.

◆ ప్రవేశ పరీక్ష తేదీ : అక్టోబర్ – 02 – 2022 ( 11.00 AM to 01.00PM)

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE

◆ పరీక్ష కేంద్రాలు : 11 జిల్లా కేంద్రాలు (ఖమ్మం, జగిత్యాల, సిద్దిపేట, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మహాబూబునగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట)

◆ కోచింగ్ సమయం : అక్టోబర్ – 19 – 2022 నుంచి మార్చి – 18 – 2023 వరకు

◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tssw/Index.do

Follow Us @