ST STUDY CIRCLE : బ్యాంకింగ్, SSC ఉద్యోగాలకై ఉచిత కోచింగ్

వరంగల్ (జూన్ – 05) : ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని గిరిజన విద్యార్థులకు బ్యాంకింగ్ (RRB) మరియు స్టాప్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉచిత వసతి, మెటీరియల్ తో 60 రోజుల పాటు శిక్షణ అందించడానికి ఐటీడీఏ పరిధిలోని ఎస్టీ స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ జారీ చేసింది.

అర్హతలు : ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే అర్హులు. డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

2021, 2022, 2023లలో ఉచిత శిక్షణ తీసుకున్న వారు అర్హులు కాదు.

◆ ఎంపిక విధానం : 100 మార్కులకు పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

◆ దరఖాస్తు గడువు : జూన్ – 12 – 2023 వరకు ఆన్లైన్ ద్వారా

◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tstw/Index.do