గురుకుల ఉద్యోగాలకై ఉచిత శిక్షణ

హైదరాబాద్ (మే 12) : తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్టు బీసీ స్టడీ సర్కిళ్ల డైరెక్టర్ అలోకుమార్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 12 నుంచి ఈ నెల 25 వరకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్రంలోని 12 బీసీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ కొనసాగుతుందని అన్నారు. డిగ్రీ, బీఈడీ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తామని చెప్పారు.

వివరాలకు 040-24071178, 27077929ను సంప్రదించాలని సూచించారు

◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tsbcw/Index.do