ఉచిత సివిల్స్ మెయిన్స్ కోచింగ్ – TSSC స్టడీ సర్కిల్

హైదరాబాద్ (జూన్ – 23) : మే – 28న నిర్వహించిన UPSC CSAT-2023 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత పొందిన SC,ST,BC, మైనారిటీతో అభ్యర్థులకు ఉచిత సివిల్ సర్వీసుల మెయిన్స్ కోచింగ్ ఏర్పాటు చేస్తున్నది.

తల్లిదండ్రుల వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ. 3.00 లక్షల కంటే తక్కువగల అభ్యర్థులు జూన్ 30వ తేదీ లేదా ఆలోగా దిగువ డాక్యుమెంట్లతోపాటు డైరెక్టర్, TSSC స్టడీ సర్కిల్, బంజారాహిల్స్, హైదరాబాద్ ను స్వయంగా సంప్రదించవలసిందిగా
ఆదేశించడమైనది.

1) UPSC CSAT-2023 హాల్ టికెట్,
2) క్యాస్ట్ సర్టిఫికెట్,
3) MRO జారీ చేసిన ఇటీవలి ఆదాయ సర్టిఫికెట్ (జూన్ 2022 మరియు మే 2023 మధ్య)
4) మీరు ఆఖరిగా చదివిన విద్యార్హత యొక్క ప్రొవిజినల్ సర్టిఫికెట్,
5) ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ,
6) రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు.

అడ్మిషన్ మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన ఇవ్వబడుతుంది మరియు కేటగిరీ వారీగా లభించే సీట్లు SC-27. ST-2 మరియు BC-2. ఒక నిర్ణీత కేటగిరీలో తగినంత మంది అభ్యర్థులు అడ్మిట్ కాకపోతే ఆ సీట్లు ఇతర కేటగిరీలతో కూడా భర్తీ చేయబడతాయి.