ST STUDY CIRCLE : ఉచిత సివిల్స్ కోచింగ్

హైదరాబాద్ (జూన్ – 07) : తెలంగాణ ఎస్టీ స్టడీసర్కిల్ లో రెసిడెన్షియల్ విధానంలో సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ప్రవేశానికి జూన్ 9 నుంచి జులై 7 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టీనా తెలిపారు. అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.

వార్షికాదాయం రూ. 3లక్షల్లోపు ఉండి… అభ్యర్థులు
సీశాట్-2024 పరీక్ష రాసేందుకు అన్ని అర్హతలు కలిగి
ఉండాలన్నారు. ఎస్టీ స్టడీసర్కిల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో జూన్ – 09 నుండి దరఖాస్తు చేయాలన్నారు.

◆ వెబ్సైట్ : TS ST STUDY CIRCLE