విజయవాడ (జూలై – 21) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కిల్ రాష్ట్రంలోని ఏపీ స్టడీ సర్కిల్ వివిధ కేంద్రాలలో ఉచితంగా సివిల్స్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకై వసతితో కూడిన రెసిడెన్షియల్ కోచింగ్ (Free civils and groups coaching by ap study circle 2023)ఇవ్వడానికి నిరుద్యోగులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ వర్గాల అభ్యర్థులు తమ కుటుంబ ఆదాయం 6 లక్షల లోపు కలిగి ఉండాలి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల 21 – నుండి 32 ఏళ్ల మధ్య వయోపరిమితి కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు కలదు.
ఆన్లైన్ ద్వారా కింద ఇవ్వబడిన లింకు ద్వారా ఆగస్టు 05 – 2023 తేదీ లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, ఏపీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ – 1, మరియు గ్రూప్ – 2 ఉద్యోగాలకు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాలుగా గల స్టడీ సెంటర్లలో ఉచిత వసతితోపాటు కోచింగ్ ను అందించనున్నారు.
ఈ ఉచిత కోచింగ్ కొరకు అభ్యర్థులను ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో చూపిన మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా తుది ఎంపిక చేయనున్నారు.