Free Civils Coaching : జూలై 31 నుంచి బీసీ స్టడీసర్కిల్ సివిల్స్ శిక్షణ

హైదరాబాద్ (జూలై – 07) : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ & మెయిన్స్ 2024 పరీక్షల సన్నదత కోసం 150 మంది అభ్యర్థులకు జూలై నెల 31 నుంచి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

2023 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించి, 31 ఏళ్లలోపు వయసున్న 50 మందికి నేరుగా ప్రవేశాలు ఇస్తామన్నారు. ఇతరులు జూలై 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశపరీక్ష 16న నిర్వహిస్తామని వెల్లడించారు. మరిన్ని వివరాలకు 040 – 27077929, 7780359322 నంబర్లలో సంప్రదించాలన్నారు.

◆ వెబ్సైట్ : https://studycircle.cgg.gov.in/tsbcw/TSBCCIVILSReg23.do