- ఈ శిబిరం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుచున్నది.
హనుమకొండ (మార్చి – 24) : జిల్లా కలెక్టర్ గారి సూచనల ప్రకారము ఒమేగా బన్ను హాస్పిటల్ వారిచే (28.3.2023- మంగళవారం) ఉదయం 10 గం౹౹ల నుండి సాయంత్రం వరకు (IDOC) సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, హనుమకొండలో ఉచిత క్యాన్సర్ పరీక్షల శిబిరము నిర్వహించబడును.
ఈ శిబిరము నందు నిర్వహించే పరీక్షలలో మహిళలలో బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ తదితర వ్యాధులను తొలి దశలో కనుగొనుటకు అవకాశము కలదు. ఈ శిబిరము నందు అనుభవజ్ఞులైన డాక్టర్స్ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించుటయే కాక కాన్సర్ నిర్దారణ పరీక్షలు నిర్వహించి తగు వైద్య సలహాలను అందించగలరు.
ఈ శిబిరం ఎంతో మంది కి ఉపయోగపడే విధంగా తోడ్పడుతుందని భావిస్తూ మహిళా ఉద్యోగస్తులు మరియు ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులు ఈ శిబిరానికి హాజరు కావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.