ఉచితంగా అమెజాన్ మినీ టీవీ.

అమెజాన్‌ భారత్‌లో ఇ-కామర్స్‌ రంగంతో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోనూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో పేరుతో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఉచిత “అమెజాన్‌ మినీ టీవీ” స్ట్రీమింగ్‌ సర్వీస్‌ను శనివారం భారత్‌లో లాంచ్‌ చేసింది.

ఇది అమెజాన్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌లో ఉచిత “అమెజాన్‌ మినీ టీవీ” లో వెబ్‌ సిరీస్‌, కామెడీ షోలు, టెక్‌ న్యూస్‌, ఆహారం, బ్యూటీ, ఫ్యాషన్‌ తదితర కంటెంట్‌ను అందిస్తుంది. కంటెంట్‌ను పూర్తి ఉచితంగా వినియోగించుకోవచ్చు. కాకపోతే ఇందులో ప్రకటనలు వస్తాయి.

కొత్త సర్వీస్‌ లాంచ్‌తో వీడియో ఎంటర్‌టైన్మెంట్‌ విభాగంలో అమెజాన్‌ రెండు స్ట్రీమింగ్‌ యాప్‌లను కలిగి ఉంది. ఇందులో ఒకటి మినీటీవీ కాగా మరొకటి ప్రైమ్‌ వీడియో.

‘మినీటీవీ పూర్తిగా ఉచితం. దీని కోసం ప్రత్యేక యాప్‌ అవసరం లేదు. ప్రైమ్‌ వీడియో కంటెంట్‌ను చూసేందుకు ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ అవసరం. ఇందులో ఇంగ్లీష్‌తో పాటు తొమ్మిది భారతీయ భాషల్లో అమెజాన్ ఒరిజినల్స్‌, తాజా సినిమాలు, టీవీ షోల కంటెంట్‌ ఉందని’ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Follow Us@