Free Inter : ఉచితంగా కార్పొరేట్‌ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు

BIKKI NEWS (MAY 16) : free admissions in corporate intermediate colleges scheme. 2025-26 విద్యా సంవత్సరానికి గాను కార్పొరేట్‌ కళాశాలలో ప్రవేశానికి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ విద్యార్థులు దరఖాస్తు కొరకు ప్రకటన విడుదల చేశారు.

free admissions in corporate intermediate colleges scheme.

మార్చి 2025 సంవత్సరంలో పదో తరగతిలో ఉత్తీర్ణులై 7.0 జీపీఏ పైన లేదా 400 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ , తెలంగాణ రెసిడెన్షియల్‌, ఎయిడెడ్‌, నవోదయ, కస్తూర్బా, బెస్ట్‌ అవైలబుల్‌, తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు.

వెబ్‌సైట్‌ లో ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వి ద్యార్థుల లిస్టును జూన్‌ 5వ తేదీన ప్రచురిస్తారని ఆయన పేర్కొన్నారు.

వెబ్సైట్ : https://telanganaepass.cgg.gov.in

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు