భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు – విశేషాలు

BIKKI NEWS : భారతదేశాన్ని సందర్శించిన విదేశీ యాత్రికులు – విశేషాలను పోటి పరీక్షలు నేపద్యంలో ఒకే చోట నేర్చుకుందాం. foreign-travelers-visiting-india-highlights-in-telugu

డీమాకోస్ :- (320-273 BC) గ్రీక్ రాయబారి, బిందుసారుని పాలనలో భారతదేశానికి వచ్చారు.

మెగస్తనీస్ :- (302-298 BC) గ్రీక్ ఎథ్నోగ్రాఫర్ & రాయబారి. చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో సందర్శించిన సెల్యూకస్ నికేటర్ రాయబారి. ఇండికా అనే ఆసక్తికరమైన పుస్తకాన్ని రాశారు.

టోలెమీ :- (130 క్రీ.శ) గ్రీస్ రాయబారి మరియు జియోగ్రాఫర్. ప్రాచీన భారతదేశం యొక్క వివరణను అందించే “భారతదేశ భౌగోళిక శాస్త్రం” వ్రాశారు.

★ ఫా-హీన్ :- (405-411 AD) చైనీస్ బౌద్ధ సన్యాసి. చంద్రగుప్తుడు – 2, విక్రమాదిత్య పాలనలో భారతదేశానికి వచ్చాడు. బుద్ధుని జన్మస్థలమైన లుంబినిని సందర్శించారు. అతని ట్రావెలాగ్ “రికార్డ్స్ ఆఫ్ బౌద్ధ రాజ్యాల”. ఫో-క్యో-కి రాశారు.

★ హుయెన్-త్సాంగ్ :– (630-645 AD) చైనీస్ బౌద్ధ సన్యాసి. హర్షవర్ధనుని కాలంలో భారతదేశాన్ని సందర్శించారు. తాష్కెంట్ మరియు స్వాత్ వ్యాలీ మీదుగా వచ్చారు. వ్రాసిన పుస్తకం “Si-Yu-Ki or the records of Western world”.

ఇత్సింగ్ :- (671- 695 AD) చైనీస్ యాత్రికుడు. బౌద్ధమతానికి సంబంధించి భారతదేశాన్ని సందర్శించారు. ఇతని రచనలు ప్రముఖ సన్యాసుల జీవిత చరిత్రలు. ఈ దేశ ప్రజల సామాజిక, మత మరియు సాంస్కృతిక జీవితం గురించి ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది.

ఆల్‌ మసూది :- సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడైన మసూది రచనల వలన క్రీ.శ. 10వ శతాబ్దినాటి భారతదేశ వాణిజ్య విధానము, ఇతర దేశములతో భారతదేశమునకు గల సంబంధములు తెలియుచున్నవి.

ఆల్బెరుని :- మహమ్ముద్ ఘజనీ ఆస్థానము యందుండెను. ఘజనీ భారత దండయాత్రలో ఇతడు కూడా భారతదేశమును సందర్శించి సంస్కృతమును నేర్చుకొనెను. ఇతడు రచించిన ‘కితాబ్ ఉల్ హింద్‘ క్రీ.శ. 10,11 శతాబ్దముల ఉత్తర భారత చరిత్రకు ముఖ్య ఆధారము.

మార్కోపోలో :- ఇటలీ నందలి వెనీస్ నగరానికి చెందినవాడు. క్రీశ. 13వ శతాబ్దిలో (1292-1294) దక్షిణ భారతదేశమును సందర్శించడం జరిగింది. ఇతడు మోటుపల్లి రేవును చేరెను. కాకతి రుద్రమదేవి కాలములో ఇతడు ఆంధ్రదేశమును సందర్శించెను

ఇబన్ బటూట్ :- మహమ్మద్ బీన్ తుగ్లక్ కాలములో (1333-1347) భారతదేశమును సందర్శించి సమకాలిక భారతదేశ పరిస్థితులను తాను రచించిన ‘కితాబ్-ఉల్-రహ్లా’ అను గ్రంథములో వివరించెను.

నికోలో కాంటి :- ఇతడు ఇటలీ యాత్రికుడు. విజయనగర సామ్రాజ్యమును సంగమ రెండవ దేవరాయలు పాలించిన కాలములో (1420 -1421) దక్షిణ భారతదేశమును సందర్శించి సమకాలిక పరిస్థితులను తన రచనలలో వివరించెను.

★ అబ్దుల్ రజాక్ :- ఇతడు పర్షియా రాయబారిగా ఫరూక్ పంపుగా రెండవ దేవరాయల ఆస్థానమును (1343-1344) సందర్శించి విజయనగర వైభవమును తన రచనలలో వర్ణించెను.

అథేనేసియస్ నికెటిన్ :- మూడవ మహమ్మద్ షా బహమని రాజ్యమును పాలించిన రోజులలో (1470 – 74) దక్షిణ భారతదేశమును సందర్శించిన రష్యా వ్యాపారి.

బార్బోసా :- శ్రీకృష్ణదేవరాయల కాలమునాటి సామాన్య ప్రజానీకపు జీవన విధానమును గురించి తెలుసుకొనుటకు (1500-1516) పోర్చుగీసు యాత్రికుడైన బార్బోసా రచనలు ఉపకరించును.

డొమింగ్ పెయాజ్ :శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చిన (1520-1522) పోర్చుగీసు రాయబారి, ఇతని రచనల వలన శ్రీకృష్ణదేవరాయల వ్యక్తిగత విషయాలు, రాయల పాలన తెలియుచున్నది.

న్యూనిజ్ : ఇతడు పోర్చుగీసు యాత్రికుడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర ప్రారంభం నుండి అచ్యుతరాయల కాలం వరకు గల విశేషములను (1530-1537) తన రచనలలో వివరించెను.

★ విలియం హకిన్స్ :- ఇంగ్లాండ్ రాజు మొదటి జేమ్స్ పంపగా జహంగీరు చక్రవర్తి దర్బార్‌ను సందర్శించిన (1608-1611) ఆంగ్ల రాయబారి. ఈతని రచనల వలన జహంగీర్ జీవిత విశేషములు తెలియుచున్నవి.