Home > BUSINESS > Income Tax – విదేశాలలో సంపాదించిన, ఉన్న ఆస్తుల వివరాలు ఇవ్వకుంటే 10 లక్షల జరిమానా

Income Tax – విదేశాలలో సంపాదించిన, ఉన్న ఆస్తుల వివరాలు ఇవ్వకుంటే 10 లక్షల జరిమానా

BIKKI NEWS (NOV. 18) : Foreign income and assets must reveal – income tax department. ఆదాయపు పన్ను శాఖ విదేశాల్లో ఉన్న ఆస్తులతో పాటు విదేశాల్లో ఆర్జించిన ఆదాయాన్ని వెల్లడించకుంటే రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తామని కంప్లయన్స్‌ కం అవేర్‌నెస్‌’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Foreign income and assets must reveal – income tax department

2024- 25 సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఇందుకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని పన్ను చెల్లింపుదారులకు సూచించింది.

భారతీయ పన్ను చెల్లింపుదారులు విదేశీ బ్యాంక్ ఖాతా, నగదు రూప బీమా, యాన్యుటీ కాంట్రాక్ట్, సంస్థ, వ్యాపారంలో ఆర్థిక భాగస్వామ్యం, రియల్ ఎస్టేట్, కస్టోడియల్ ఖాతా, ఈక్విటీ, రుణ వడ్డీ వంటి ఏదైనా మూలధన ఆస్తి గురించి సమాచారాన్ని ఇవ్వాల్సిందేనని ఆర్థిశాఖ పేర్కొంది.

పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయం ‘పన్ను విధించదగ్గ పరిమితి కంటే తక్కువగా’ ఉన్నప్పటికీ తమ ఐటీఆర్‌లో విదేశీ ఆస్తి (FA), విదేశీ మూలధార ఆదాయం (FSI) షెడ్యూల్‌ని తప్పనిసరిగా పూరించాలని చెప్పింది.

ఐటీఆర్‌లో విదేశీ ఆస్తులు, ఆదాయాన్ని బహిర్గతం చేయని పక్షంలో రూ.10లక్షల జరిమానా విధించనున్నట్లు స్పష్టం చేసింది. 2024-25కి సంబంధించి ఇప్పటికే ఐటీఆర్‌ను దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారులకు క్యాంపెయిన్‌లో భాగంగా సందేశాలు, ఈ-మెయిల్స్‌ను పంపనున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) పేర్కొంది.

ఐటీఆర్ (ఏవై 2024-25)లో విదేశీ ఆస్తుల వివరాలను ఇవ్వని వారికి గుర్తు చేయడమే ఈ ప్రచారం ఉద్దేశమని పేర్కొంది. ఐటీఆర్ ఫైల్ చేయడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా గడువు నిర్ణయించిన విషయం తెలిసిందే.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు