FORBES 50 : అత్యధిక వేతనం పొందుతున్న అథ్లెట్లు 2022

హైదరాబాద్ (డిసెంబర్ – 26) : 2022వ సంవత్సరంలో అత్యధిక పారితోషికం పొందిన 50 మంది అథ్లెట్స్ జాబితాను పోర్బ్స్ సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్ నుండి ఎవరు చోటు సంపాదించలేదు.

జాబితాలో మొదటి స్థానంలో అర్జెంటీనా పుట్‌బాల్ జట్టు కెప్టెన్ పిఫా 2022 విజేత లియోనల్ మెస్సీ 130 మిలియన్ డాలర్ల సంపాదనతో నిలిచాడు.

రెండో స్థానంలో లెబ్రోన్ జేమ్స్ (బాస్కెట్‌బాల్), మూడో స్థానంలో క్రిస్టియన్ రోనాల్డో (పుట్‌బాల్), నాలుగో స్థానంలో నెయ్‌మార్ (పుట్‌బాల్), ఐదవ స్థానంలో స్టీపెన్ కర్రీ (బాస్కెట్‌బాల్) నిలిచారు.

సెరెనా విలయమ్స్ 31వ స్థానంలో, ఎంబాపే (పుట్‌బాల్) 35వ స్థానంలో నిలిచారు.

నియోమి ఒసాకా రెండు యూఎస్, రెండు ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్స్ నెగ్గింది. వరల్డ్ టెన్నిస్ ర్యాంకింగ్స్ లలో 19వ స్థానంలో నిలిచింది.