హైదరాబాద్ (డిసెంబర్ 03) : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TSPSC) నిర్వహించిన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) పోస్టుల తుది ‘కీ’ని డిసెంబర్ 5న వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
అదే రోజు నుంచి అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు కూడా వెబ్సైట్లో ఉంటాయని పేర్కొన్నారు. FSO పరీక్షలో నాలుగు ప్రశ్నలను తొలగించామని, మరో నాలుగు ప్రశ్నలకు ఏ ఆప్షన్ పెట్టినా సరైన సమాధానంగా పరిగణిస్తామని వెల్లడించారు. తుది కీపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టంచేశారు.
వెబ్సైట్ : https://www.tspsc.gov.in