కన్వీనర్ కోటాలో మెడికల్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్

తెలంగాణ లోని కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ మెడికల్ కళాశాలలో కన్వీనర్ కోటలో ఉన్న ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ డిసెంబర్ 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కాళోజీ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. ఈనెల 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 4వ తేదీ సాయింత్రం 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలన్నారు.

యూనివర్సిటీ వెబ్సైట్ లో పొందుపరిచిన తుది మెరిట్ జాబితాలో పేర్లు ఉన్న అభ్యర్థులు అందరూ వెబ్ కౌన్సెలింగ్‌కు అర్హులని, వారందరు ప్రాధాన్యత క్రమంలో కళాశాల వారీగా ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్స్ ఇవ్వాలని తెలిపారు. కళాశాల వారీగా ఖాళీలను వెబ్సైట్ లో ఉన్నాయన్నారు. మరింత సమాచారానికి యూనివర్సిటీ వెబ్సైట్ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

● వెబ్సైట్ ::

http://www.knruhs.telangana.gov.in/

పూర్తి నోటిఫికేషన్ PDF

https://drive.google.com/file/d/1HzYSHzxYSPoYgxeCEt5cbGr8d1DZA9Bq/view?usp=drivesdk
Follow Us@