కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్థిక శాఖ ఆమోదం.!

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కొరకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు అర్హత కలిగి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

దాదాపు 11103 మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే వీరికి ఆర్థిక శాఖ తాజాగా ఆమోదం తెలిపి… వివరాలను అతి త్వరలో సంబంధించిన శాఖలకు పంపనున్నట్లు సమాచారం.

అలాగే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కంటే ముందు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ చేసి మిగిలిన ఖాళీలతో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం… ఇప్పటికే ఉద్యోగార్దుల వయోపరిమితిని పదేళ్లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే.

ఈరోజు జరిగిన సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో కూడా ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే.

Follow Us @