ఖాళీగా ఉన్న, కాంట్రాక్టు టీచర్లు పని చేస్తున్న పోస్టులను భర్తీ చేయండి – వినోద్ కుమార్

తెలంగాణ రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్కూళ్లలో ఖాళీగా ఉన్న మరియు కాంట్రాక్టు టీచర్లు పని చేస్తున్న టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ కు లేఖ రాశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 35 కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్కూల్స్ ఉన్నాయని వీటిలో మంజూరు అయిన పోస్టులు 1208 ఉండగా వాటిలో 959 మంది రెగ్యులర్ టీచర్లు పనిచేస్తుండగా, 131 మంది కాంట్రాక్టు టీచర్లు పని చేస్తున్నారు మరియు 128 ఖాళీ పోస్టులు ఉన్నాయని తెలిపారు.

కేంద్రీయ విద్యాలయ సంఘటన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు అభిప్రాయం ప్రకారం పూర్తిస్థాయిలో రెగ్యులర్ టీచింగ్ సిబ్బంది లేకపోవడం వల్ల విద్యా ప్రమాణాలు పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు తన దృష్టికి తెచ్చారని, మెరుగైన విద్యా ప్రమాణాలు అందించడానికి వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులను మరియు కాంట్రాక్టు టీచర్లు పనిచేస్తున్న పోస్టులను భర్తీ చేయవలసిందిగా లేఖలో విజ్ఞప్తి చేశారు.

Follow Us@