FIFA WC FINAL 2022 WINNER ARGENTINA

  • మొదటి అర్దబాగం మెస్సీ, డీ మారియో గోల్స్
  • రెండో అర్ద బాగంలో రెండు గోల్స్ తో ఎంబాపే మాయా.
  • ఎక్స్‌ట్రా టైం లో చేరో గోల్ చేసిన మెస్సీ, ఎంబాపే
  • గోల్డెన్ బూట్ అవార్డు విజేత ఎంబాపే
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (గోల్డేన్ బాల్ అవార్డు) లియోనల్ మెస్సీ
  • గోల్డేన్ హ్యాండ్ అవార్డు విజేత అర్జెంటీనా గోల్ కీపర్ మార్టీనేజ్
  • ఇనోజ్ ఫెర్నాండెజ్ యంగ్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్నాడు

ఖతార్ (డిసెంబర్ – 18) : Fifa world cup final 2022 మ్యాచ్ లో అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్ ప్రాన్స్ పై ఫెనాల్టీ షూటౌట్ లో 4-2తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా గోల్ కీపర్ మార్టీనేజ్ రెండు ఫెనాల్టీ షూటౌట్ లను ఆపడంతో హీరోగా నిలిచాడు.

ఫెనాల్టీ షూటౌట్

ఫ్రాన్స్అర్జెంటీనా
11
01
01
11

మొదటి అర్ద బాగంలో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ కెప్టెన్ మెస్సీ 23వ నిమిషంలో గోల్ చేయగా, 36వ నిమిషంలో డీ మారియో మరో గోల్ తో అర్జెంటీనా 2-0 ఆధిక్యంతో మొదటి అర్ద బాగం ముగించారు. మెస్సీ కి ఇది 12వ వరల్డ్ కప్ గోల్ కాగా అర్జెంటీనా తరపున 97వ గోల్ ఈ వరల్డ్ కప్ లో 6వ గోల్.

రెండో అర్థ భాగంలో ప్రాన్స్ కప్ మీద ఆశలు వదులుకుంటున్న వేళ ప్రాన్స్ స్టార్ ఆటగాడు ఎంబాపే అద్భుతం చేశాడు. 2 నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ చేశాడు. 80, 81వ ను మిషాలలో గోల్స్ చేసి స్కోర్ ను 2-2 తో సమం చేశాడు. అలాగే ఈ వరల్డ్ కప్ లో 7వ గోల్ చేశాడు

ఎక్స్‌ట్రా సమయంలో (30 ని౹౹) 109వ నిమిషంలో మాయాజాలంతో గోల్ చేయడంతో అర్జెంటీనా 3-2 ఆధిక్యంలోకి వెళ్ళింది. మెస్సీ కి ఇది 13వ వరల్డ్ కప్ గోల్ కాగా అర్జెంటీనా తరపున 98వ గోల్ ఈ వరల్డ్ కప్ లో 6వ గోల్. వరల్డ్ కప్ లో 7వ గోల్ చేసి గోల్డెన్ బూట్ రేసులో ఎంబాపే తో కలిసి ఉన్నాడు.118వ నిమిషంలో ప్రీకిక్ ని గోల్ చేసిన ఎంబాపే మళ్ళీ స్కోర్ 3-3తో సమం చేశాడు. ఈ వరల్డ్ కప్ లో 8 “గోల్స్ తో గోల్డెన్ బూట్ రేసులో దూసుకేళ్ళాడు. కానీ స్కోర్ సమం కావడంతో ఫెనాల్టీ షూటౌట్ కి వెళ్ళారు.

ప్రపంచంలో అత్యంత ఆదరణ గల క్రీడా పుట్ బాల్. మొదటిసారి భారీ ప్రైజ్ మనీతో టోర్నీ నిర్వహిస్తున్నారు.

★FIFA WC 2022 ప్రైజ్ మనీ వివరాలు :

విజేతకు : 347 కోట్లు
రన్నర్ కు : 248 కోట్లు
మూడో స్థానం : 223 కోట్లు (క్రొయోషియా)
నాలుగో స్థానం : 206 కోట్లు (మొరాకో)
క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 140 కోట్లు
ఫ్రీ క్వార్టర్స్ లో ఓడిన జట్లకు : 107 కోట్లు