- మూడోస్థానం కోసం జరిగిన ప్లే ఆఫ్ లో క్రొయోషియా విజయం
- నాలుగోస్థానంలో నిలిచిన ఆప్రికా దేశం మొరాకో
- రేపు ఫైనల్ మ్యాచ్ లో అర్జెంటీనా వర్సెస్ ఫ్రాన్స్
ఖతార్ (డిసెంబర్ – 17) : Fifa World Cup 2022 లో సెమీఫైనల్స్ లో ఓడిన జట్లు మొరాకో, క్రొయోషియా (Morocco vs Croatia) జట్ల మద్య మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్ లో క్రొయోషియా 2-1 తేడాతో నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. మొరాకో నాలుగో స్థానానికి పరిమితం అయింది.
మొదటి అర్ద బాగంలో క్రొయోషియా ఆటగాడు గ్వార్డియోల్ 7వ నిమిషంలో గోల్ చేస్తే, 9వ నిమిషంలో మొరాకో ఆటగాడు డరి గోల్ చేసి స్కోర్ సమం చేశాడు. అయితే 42వ నిమిషంలో క్రొయోషియా ఆటగాడు ఒర్సిక్ గోల్ చేసి 2-1 ఆధిక్యంతో మొదటి అర్థ బాగంలో తన జట్టునం నిలిపాడు
రెండో అర్థ బాగంలో ఇరుజట్లు ఎలాంటి గోల్స్ చేయకపోవడంతో క్రొయోషియా 2-1 తేడాతో గెలిచి మూడో స్థానాన్ని నిలుపుకుంది.
రేపు అర్జెంటీనా, డిఫెండింగ్ ఛాంపియన్ ప్రాన్స్ జట్ల మద్య Fifa world cup final మ్యాచ్ జరగనుంది.