నక్షత్రాలు, గెలాక్సీ లకు చెందిన కొత్త అట్లాస్ ను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. ఆస్ట్రేలియాలో ఓ ఎడారిలో ఉన్న ఆధునిక టెలిస్కోప్‌తో ఆ నక్షత్ర సమూహాలను గుర్తించారు. లక్షల సంఖ్యలో ఉన్న గెలాక్సీలను మ్యాపింగ్ చేసినట్లు వారు వెల్లడించారు.
జాతీయ సైన్స్ ఏజెన్సీ CSIRO కు చెందిన కొత్త టెలిస్కోప్ ఆ పాలపుంతలను కనిపెట్టింది. వీటితో విశ్వానికి చెందిన కొత్త అట్లాస్‌ను రూపొందించినట్లు ఆ సంస్థ చెప్పింది. సుమారు 30 లక్షల గెలాక్సీలను 300 గంటల్లోనే మ్యాపింగ్ చేసినట్లు CSIRO తెలియజేసింది.
నక్షత్రాలు ఎలా ఏర్పడ్డాయి, అవి ఎలా మహా కృష్ణ బిలాలుగా ఏర్పడ్డాయో అధ్యయనంలో తెలుస్తుందని ఆస్ట్రనామికల్ సొసైటీ ఆఫ్ ఆస్ట్రేలియాలో ప్రచురించింన తాజా రిపోర్ట్ లో పేర్కొన్నారు.