10000/- : రైతులకు ఎకరానికి పదివేల పరిహారం

BIKKI NEWS (APR. 12) : Farmers to get compensation of Rs. 10,000 per acre in telangana. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలు మరియు వడగండ్ల వానలతో పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 6 వేల నుండి పదివేల వరకు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు

Farmers to get compensation of Rs. 10,000 per acre in telangana

సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్ మరియు శ్రీధర్ బాబులతో కలిసి సిద్దిపేట జిల్లాలో పర్యటించి అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న వరి మిరప పంటలను ఆయన పరిశీలించారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఎకరాల్లో కంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేశామని తెలిపారు.

అధికారులు నష్టపోయిన పంటలను రైతుల వారీగా నమోదు చేసి నివేదికను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు..

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు