హైదరాబాద్ (ఆగస్టు 3) : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ఆగస్టు 3 నుంచి పున:ప్రారంభించాలని (Farmer loan waiver programme in telangana) ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన మాటకు కట్టుబడి వుంటామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఏర్పడిన మందగమనం, కరోనా వల్ల సంభవించిన ఆర్థిక సమస్యలు, ఎఫ్ఆర్బీఎం నిధులను విడుదలచేయకుండా కేంద్రం, తెలంగాణ పట్ల అనుసరించిన కక్షపూరిత చర్యలు తదితర కారణాల వల్ల ఆర్థికలోటుతో ఇన్నాల్లు కొంత ఆలస్యమైందని సీఎం తెలిపారు. తిరిగి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కదిద్దుకున్ననేపథ్యంలో, రాష్ట్రంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని పున: ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రగతి భవన్ లో ఈరోజు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షా సమావేశంలో ఆర్థికశాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీశ్ రావు, సీఎం ముఖ్య సలహాదారు శ్రీ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణారావు, ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ.. ‘‘ఇచ్చిన మాట ప్రకారం, రైతు రుణమాఫీ కార్యక్రమం కొనసాగించినం. కరోనా వంటి అనుకోని ఉపద్రవాల వల్ల కేంద్రం ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం నిధుల్లో ఏకపక్షంగా కోత విధించడం, తెలంగాణకు విడుదల చేయాల్సిన నిధుల విషయంలో కక్షపూరితంగా వ్యవహరించడం వల్ల రైతు రుణమాఫీ కార్యక్రమంలో కొంతకాలం పాటు జాప్యం జరిగింది. రైతులకు అందిచాల్సిన రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సాగునీరు వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో నిరాఘాటంగా కొనసాగిస్తూనే వస్తున్నది. మేము ఇప్పటికే చెప్పినట్టు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఆరునూరయినా రైతుల సంక్షేమాన్ని వ్యవసాయాభివృద్ధి కార్యాచరణను విస్మరించే ప్రసక్తేలేదు. పైగా వ్యవసాయాభివృద్ధి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏర్పాటు వంటి ఆదర్శవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నాం. తద్వారా రైతు సాధికారత సాధించే వరకు వారిని ఆర్థికంగా ఉన్నతంగా తీర్చిదిద్దే వరకు విశ్రమించే ప్రసక్తేలేదు.’’ అని స్పష్టం చేశారు.
ఇప్పటికే అందించిన రుణమాఫీ పోను మరో 19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు అందించాల్సి వుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రేపు అనగా ఆగస్టు 3వ తేదీనుంచి పున: ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావును, కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. రైతుబంధు తరహాలో విడతల వారీగా కొనసాగిస్తూ నెల పదిహేనురోజుల్లో, సెప్టెంబర్ రెండో వారం వరకు, రైతు రుణ మాఫీ కార్యక్రమాన్ని సంపూర్ణంగా పూర్తిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
- ADITYA L1
- ANDHRA PRADESH
- ASIAN GAMES 2023
- AWARDS
- BUSINESS
- CHANDRAYAAN 3
- CURRENT AFFAIRS
- EDUCATION
- EMPLOYEES NEWS
- ESSAYS
- GENERAL KNOWLEDGE
- GOOGLE NEWS
- INTERMEDIATE
- INTERNATIONAL
- JOBS
- LATEST NEWS
- NATIONAL
- NOBEL 2023
- PARA ASIAN GAMES 2022
- RESULTS
- SCHOLARSHIP
- SCIENCE AND TECHNOLOGY
- SPORTS
- STATISTICAL DATA
- TELANGANA
- TODAY IN HISTORY
- TOP STORIES
- UNCATEGORY
- WORLD CUP 2023