Home > 6 GUARANTEE SCHEMES > 18న లక్ష రూపాయల రైతు రుణమాఫీ

18న లక్ష రూపాయల రైతు రుణమాఫీ

BIKKI NEWS (JULY 16) : Farm loan Waiver on July 18th up to 1 Lakh. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ ప్రక్రియను జూలై 18 వ తేదీ నుండి ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. జులై 18 వ తేదీన లక్ష రూపాయల వరకు రుణమున్న రైతులకు రుణమాఫీ నిధులు జమ చేస్తామని స్పష్టం చేశారు ఈ మేరకు ఈరోజు కీలక ప్రకటన చేశారు.

Farm loan Waiver on July 18th up to 1 Lakh.

తెల్ల రేషన్ కార్డు అనేది కుటుంబం గుర్తింపు కోసమేనని రైతు రుణమాఫీకి ప్రామాణికం కాదని రైతు పాస్ బుక్స్ ఆధారంగానే రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు.

ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ఇందుకు సంబంధించిన నిధులు రుణం తీసుకున్న రైతుల ఖాతాలలో జమ చేస్తామని తెలిపారు.

జులై 18 వ తేదీన రైతు రుణమాఫీ సందర్భంగా ప్రజాప్రతినిధులు పెద్ద స్థాయిలో రైతులతో కలిసి రైతు వేదికలలో వేడుకలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆగస్టు 15 లోపు రైతులందరి రుణాలను మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

రైతు రుణమాఫీకి పిఎం కిసాన్ పథకం నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐటి చెల్లింపు దారులు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు రైతు రుణమాఫీ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు